Mary E Brincker: వైద్య శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి

Mary E Brincker Fred Ramsdell Shimon Sakaguchi win Nobel Prize
  • మేరీ ఇ.బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌‌డెల్, షిమన్ సకాగుచీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం
  • రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసినందుకు నోబెల్
  • ఈ నెల 13 వరకు కొనసాగనున్న నోబెల్ బహుమతులు
వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఇ.బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌‌డెల్, షిమన్ సకాగుచీకి అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. వైద్య విభాగంతో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రకటనలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి.

మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధించబడుతుందనే రహస్యాన్ని ఛేదించినందుకు గాను వీరికి ఈ పురస్కారం లభించింది. వీరి పరిశోధనలు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే విధానంపై దృష్టి సారించాయి. దీని ద్వారా నియంత్రిత టీ కణాలుగా పేర్కొనబడే ప్రత్యేక రోగనిరోధక కణాలు ఆటోఇమ్యూన్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించే సంరక్షకులుగా ఎలా పనిచేస్తాయో వారు తమ పరిశోధనలు గుర్తించారు.
Mary E Brincker
Fred Ramsdell
Shimon Sakaguchi
Nobel Prize
Nobel Prize in Medicine

More Telugu News