Chandrababu Naidu: సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో.... తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలకు బాంబు బెదిరింపు

Chandrababu Naidu Tirupati SV Agriculture College bomb threat
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపు వచ్చింది. సీఎం చంద్రబాబు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఆ బెదిరింపు ఈమెయిల్ లో హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. కాలేజి వద్ద హెలిప్యాడ్ పరిసరాల్లో అణువణువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 

ఓ కుటుంబ పరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు కుటుంబం స్వగ్రామం నారావారిపల్లె వస్తోంది. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె చేరుకోనుండగా... సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి వస్తున్నారు. ఆయన రాక కోసం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. 
Go Back to Shorts
Chandrababu Naidu
Tirupati
SV Agriculture College
Bomb threat
Nara Lokesh
Nara Bhuvaneswari
Naravaripalle
Andhra Pradesh
Helipad security
Rdx Ied

More Telugu News