Vishnu Murthy: నాడు అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టిన ఏసీపీ మృతి
- ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించిన ఏసీపీ విష్ణుమూర్తి
- నికార్సైన పోలీస్ ఆఫీసర్ అంటూ సహచరుల నివాళులు
- పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన విష్ణుమూర్తి
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రెస్ మీట్ పెట్టిన పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విష్ణుమూర్తి మరణించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పూర్తి పేరు సబ్బతి విష్ణుమూర్తి, పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారని సహచరులు తెలిపారు. విధి నిర్వహణలో, ప్రజలకు సేవచేయడంలో నిబద్ధతతో వ్యవహరించే వారని గుర్తుచేసుకుంటున్నారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలను, సామాజిక, కార్య నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభను స్మరిస్తూ పలువురు నివాళులు ఆర్పిస్తున్నారు.
ఆ రోజు ఏంజరిగిందంటే..
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై విమర్శలు రావడంతో తట్టుకోలేక ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మరీ అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పది నిమిషాలు తాము పక్కకు వెళితే మీ పరిస్థితి ఏంటని సెలబ్రెటీలను నిలదీశారు. తొక్కిసలాట ఘటనకు హీరోనే బాధ్యుడని ఆయన ఆరోపించారు.