Sreeleela: బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల

Sreeleela Bags Another Bollywood Big Offer
  • బాలీవుడ్‌లో రెండో ఆఫర్ కొట్టేసిన శ్రీలీల
  • కరణ్ జొహార్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్
  • ఇప్పటికే కార్తిక్ ఆర్యన్ మూవీలో నటిస్తున్న శ్రీలీల
టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో పాటు చలాకీతనంతో యువతను ఆకట్టుకుంటున్న శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్ వైపు తన అడుగులు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఒక హిందీ సినిమాలో నటిస్తున్న శ్రీలీల... ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.

వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న 'దోస్తానా 2' సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు గ్రహీత విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నారు. వాస్తవానికి, ఈ పాత్ర కోసం ముందుగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. దీంతో ఆ అద్భుత అవకాశం శ్రీలీలను వరించినట్టు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై నిర్మాత కరణ్ జొహార్ తుది చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీలీల, బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ సరసన ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు రెండో అవకాశం కూడా ఆమె తలుపు తట్టడంతో, బాలీవుడ్‌లో శ్రీలీల కెరీర్ దూసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా రెండు పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు రావడంతో, శ్రీలీల బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Sreeleela
Sreeleela Bollywood
Dostana 2
Karan Johar
Vikrant Massey
Janhvi Kapoor
Kartik Aaryan
Bollywood debut
Telugu actress

More Telugu News