Vijay: విజయ్ ప్రచార రథం సీజ్ చేసిన పోలీసులుు

Vijays Campaign Vehicle Seized by Police
  • విజయ్ కరూర్ సభలో తీవ్ర విషాదం.. 41 మంది మృతి
  • సభకు ముందే ప్రచార రథం కిందపడి ఇద్దరికి గాయాలు
  • రోడ్డు ప్రమాదం ఘటనలో విజయ్ ప్రచార వాహనం సీజ్
ఇటీవల తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, విజయ్‌కు మరో షాక్ తగిలింది.

కరూర్ సభ జరగడానికి కొన్ని గంటల ముందు విజయ్ ప్రచార రథం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆ ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Vijay
Vijay actor
Tamil Nadu
Karur
TVK party
Road accident
Police investigation
Political rally
Crowd surge
Accident investigation

More Telugu News