Nara Lokesh: జాతీయస్థాయి ఐటీఐ పరీక్షల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ.. అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

Nara Lokesh Congratulates AP Students for ITI Exam Success
  • వివిధ ట్రేడ్ లలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించిన 17 మంది విద్యార్థులు
  • ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సత్కారం పొందిన ముగ్గురు విద్యార్థులు
  • ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన మంత్రి లోకేశ్
విద్యార్థులను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐటీఐ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించడంతో పాటు వారికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక, ఆచరణాత్మక శిక్షణను ప్రభుత్వం అందిస్తోంది. ఫలితంగా మన విద్యార్థులు జాతీయ స్థాయి ఐటీఐ పరీక్షల్లో రాణించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లాభదాయకమైన ఉపాధి అవకాశాల కోసం పోటీపడేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది.

కూటమి ప్రభుత్వ కృషి కారణంగా ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో వివిధ ట్రేడ్ లకు సంబంధించి 17 మంది రాష్ట్ర విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ లు సాధించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా టాపర్ సర్టిఫికెట్లు అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో శనివారం నిర్వహించిన ‘కౌశల్ దీక్షాత్ సమరోహ్’ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పి.మధులత (ఆర్ అండ్ సీ టెక్నీషియన్), డి.వందన (పెయింటర్ జనరల్), ఎస్.యామిని వరలక్ష్మి (వుడ్ వర్క్ టెక్నీషియన్) సత్కారం పొందారు.

నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులు, ముఖ్యంగా ట్రేడ్ టెస్ట్ లలో ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించేందుకు ఏటా ‘కౌశల్ దీక్షాత్ సమరోహ్’ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందించారు. దేశ, విదేశీ కంపెనీలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషిచేస్తామని ఆయన చెప్పారు. 
Nara Lokesh
AP ITI students
Kaushal Deekshat Samaroh
Skill development AP
ITI colleges Andhra Pradesh
Narendra Modi
AP Skill Development
Top rankers

More Telugu News