Telangana State Election Commission: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు... కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం

Telangana State Election Commission sets up call center for local body elections
  • ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
  • మొదటి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
  • ఫిర్యాదులు, సంబంధిత అంశాల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో తొలి రెండు దశల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మిగతా మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబడతాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు మరియు సంబంధిత అంశాలపై వివరాల కోసం 9240021456 నెంబర్‌కు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 జెడ్పీటీసీ స్థానాలకు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు, 12,733 గ్రామ పంచాయతీలకు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ జరుగుతుంది.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న పోలింగ్ ఉంటుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఏ విడత ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Telangana State Election Commission
Telangana local body elections
MPTCl elections
ZPTC elections

More Telugu News