తెలంగాణ మద్యం దుకాణాలకు వారం రోజుల్లో 447 దరఖాస్తులు
- సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
- సోమవారం నుండి దరఖాస్తులు పెరిగే అవకాశం
- అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో నిర్వాహకుల ఎంపిక
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల నిర్వాహకుల ఎంపిక అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు రూ. 3 లక్షల డీడీ లేదా రూ. 3 లక్షలు చలాన్ల రూపంలో చెల్లించిన రసీదును జత చేయాలి.
మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించారు. డీడీలు, చలాన్లను డీపీవో (జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి) పేరున తీయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజర్వేషన్లు, దరఖాస్తుకు సంబంధించిన ఇతర వివరాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.