OG movie: కెనడాలో కలకలం.. భద్రత కారణాలతో ‘ఓజీ’, ‘కాంతార’ షోలు క్యాన్సిల్
- ఓక్‌విలేలోని ఓ థియేటర్‌పై గుర్తుతెలియని వ్యక్తుల వరుస దాడులు
- నిప్పు పెట్టే ప్రయత్నం, ఆ తర్వాత కాల్పుల ఘటనతో భయాందోళనలు
- ప్రేక్షకుల భద్రత దృష్ట్యా థియేటర్ యాజమాన్యం కీలక నిర్ణయం
విదేశాల్లో భారతీయ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణకు కెనడాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఓక్‌విలే పట్టణంలోని ప్రముఖ థియేటర్ ‘ఫిల్మ్.కా సినిమాస్’ (Film.Ca Cinemas) భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల తమ థియేటర్‌పై వరుస దాడులు జరగడంతో, ప్రేక్షకుల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’, రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ వంటి భారీ చిత్రాల ప్రదర్శనలు కూడా రద్దయ్యాయి.
వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 25న ఈ థియేటర్ వద్ద గుర్తు తెలియని కొందరు దుండగులు నిప్పు పెట్టేందుకు విఫలయత్నం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే, మరో దుండగుడు తెల్లవారుజామున థియేటర్ ప్రవేశ ద్వారంపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ వరుస దాడుల నేపథ్యంలో, తమ సిబ్బంది, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ దాడుల వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇటీవలి కాలంలో కెనడాలోని భారత కాన్సులేట్‌కు కూడా ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో అక్కడి తెలుగు, తమిళ, హిందీ సినిమా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వాపసు ఇస్తున్నట్లు థియేటర్ తెలిపింది. స్థానిక పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని, థియేటర్లలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని భారతీయ సమాజం కోరుతోంది.