మంగళగిరి వద్ద రూ.112 కోట్లతో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
- రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుదలకు కీలక ముందడుగు
- మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఆరు లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి
- మంత్రి పెమ్మసాని ప్రతిపాదనతో చర్యలు చేపట్టిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. మంగళగిరి – కృష్ణా కాలువ రైల్వే స్టేషన్ల మధ్య రూ.112 కోట్ల వ్యయంతో ఆరు లైన్లతో నిర్మించనున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)కి రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసింది.
ఈ ఆర్ఓబీ నిర్మాణం జాతీయ రహదారి నుండి అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ13 ప్రధాన రహదారిని నేరుగా అనుసంధానించేలా వుంటుంది. మంగళగిరిలోని డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరగనుంది.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆరు లైన్ల ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ ఆర్ఓబీ నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాక మంగళగిరి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాజధానికి రాకపోకలు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు.