Mohammed Siraj: నిప్పులు చెరిగిన సిరాజ్.. లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయిన విండీస్

Mohammed Siraj Burns Through West Indies Top Order
      
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌ను భారత బౌలర్లు దారుణంగా దెబ్బకొట్టారు. ముఖ్యంగా సిరాజ్ బంతితో నిప్పులు చెరిగాడు. మూడు వికెట్లు పడగొట్టి కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో లంచ్ సమయానికి విండీస్ 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది.

బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. చందర్‌పాల్ (0), అలక అథనాజే (12), బ్రాండన్ కింగ్ (13)ను సిరాజ్ పెవిలయన్‌కు పంపగా, ఓపెర్ జాన్ క్యాంప్‌బెల్‌ (8)ను బుమ్రా, వికెట్ కీపర్ షాయ్ హోప్(26)ను కుల్దప్ యాదవ్ పెవిలియ్ పంపారు. కెప్టెన్ రోస్టన్ చేజ్ (22) క్రీజులో ఉన్నాడు.
Mohammed Siraj
India vs West Indies
India
West Indies
Narendra Modi Stadium
Ahmedabad
Test Series
Cricket
Jasprit Bumrah
Kuldeep Yadav

More Telugu News