cough syrup deaths: దగ్గు మందు తాగి ఇద్దరు చిన్నారుల మృతి.. అది సురక్షితమేనని చెప్పి, తాగిన వైద్యుడికి అస్వస్థత

Cough Syrup Deaths Two Children Die Doctor Falls Ill
  • రాజస్థాన్‌లో దగ్గు మందు సిరప్‌తో ఇద్దరు చిన్నారుల మృతి
  • మరో 10 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత
  • ఓ ఫార్మా సంస్థకు చెందిన 22 బ్యాచ్‌ల సిరప్‌పై నిషేధం
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
దగ్గుమందు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు వారి ముందే దగ్గుమందు తాగి ఓ వైద్యుడు అస్వస్థతకు గురయ్యాడు. రాజస్థాన్‌లోని బయానా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. సెప్టెంబర్ 24న మూడేళ్ల చిన్నారికి డాక్టర్ తారాచంద్ యోగి దగ్గు తగ్గడానికి సిరప్ ఇచ్చారు. అది తాగిన బాలుడు అస్వస్థతకు గురవడంతో, తల్లిదండ్రులు వైద్యుడిని నిలదీశారు. వారికి నమ్మకం కలిగించేందుకే ఆయన ఆ సిరప్‌ను వారి ముందే తాగారు. అనంతరం కారులో ఇంటికి బయలుదేరిన ఆయన మార్గమధ్యంలోనే స్పృహ కోల్పోయారు.

ఈ వివాదాస్పద సిరప్ ఇప్పటికే ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. సికార్ జిల్లా చిరానాకు చెందిన నితీశ్ (5) అనే బాలుడికి సెప్టెంబర్ 28న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఈ సిరప్ ఇచ్చారు. రాత్రి ఆ మందు తాగిన బాలుడు, ఉదయం నిద్రలేవలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు, సెప్టెంబర్ 22న మల్లా ప్రాంతంలో సామ్రాట్ జాతవ్ (2) అనే చిన్నారి కూడా ఇదే సిరప్ కారణంగా మృతి చెందాడు. జ్యోతి అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెచ్చిన ఇదే సిరప్ ఇవ్వగా, ముగ్గురూ స్పృహ కోల్పోయారు. వారిలో ఇద్దరు వాంతులు చేసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడగా, సమ్రాట్ ప్రాణాలు విడిచాడు.

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసన్ అనే సంస్థ సరఫరా చేసిన 22 బ్యాచ్‌ల దగ్గు మందు సిరప్‌లను తక్షణమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటి పంపిణీని పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
cough syrup deaths
Rajasthan
child death
cough medicine
Dr Tarachand Yogi
Kesan pharmaceuticals
drug recall
pediatric medicine
adverse drug reaction
government hospital

More Telugu News