Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు మూహూర్తం ఖరారు

Chandrababu Naidu Foreign Tour Schedule Fixed
  • ఈ నెల 22 నుంచి 24వ వరకు దుబాయ్, అబుదాబీ, యూఏఈలలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
  • చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన జీఏడీ (పొటికల్) సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా
  • చంద్రబాబు వెంట మంత్రులు టిజి భరత్, బీసీ జనార్దన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్నారు.

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా పార్టనర్‌షిప్ సమ్మిట్ -2025 జరగనుంది. ఈ సమ్మిట్‌కు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

అలాగే రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో సైతం పెట్టుబడుదారులకు ఆయన స్వాగతం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టి.జి.భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఏపీఐఐసీ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ విదేశీ పర్యటనకు జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Dubai
Abu Dhabi
Partnership Summit 2025
Visakhapatnam
Foreign Investments
UAE

More Telugu News