తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు
- 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన చంద్రబాబునాయుడు
- అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నామన్న ముఖ్యమంత్రి
- ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్‌పై ఇదేవిధంగా కొనసాగాలని కోరుకున్న చంద్రబాబు
సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేదల సేవలో పెన్షన్లు, మహిళామతల్లులకు ఆసరాగా నిలిచే 'దీపం', ఉచిత బస్సు ప్రయాణ పథకం 'స్త్రీశక్తి', బిడ్డలను విద్యావంతుల్ని చేసే 'తల్లికి వందనం', రైతుకు అండగా నిలిచే 'అన్నదాత సుఖీభవ', పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే 'పీ4' విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.