Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో డీసీఎంలో మంటలు.. మద్యం బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు
- వాహనంలో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్
- మంటలు రావడంతో పాక్షికంగా కాలిపోయిన మద్యం బాటిళ్లు
- మద్యం బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు
హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంలో అగ్నిప్రమాదం సంభవించింది. వాహనంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో పలు మద్యం సీసాలు పాక్షికంగా కాలిపోయాయి.
మద్యం సీసాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో, వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. మద్యం సీసాలు పడిపోయిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సంఘటన స్థలానికి పరుగులు తీశారు. ఈ సంఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.