IMD: తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Heavy Rain Expected in AP Telangana Due to Cyclone
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
  • రేపు ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం
  • 3న ఉత్తర కోస్తా - దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే ఛాన్స్
  • కోస్తాంధ్ర, తెలంగాణకు నేడు ఎల్లో అలర్ట్ జారీ
  • గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం 
  • తీరం వెంబడి మూడు రోజుల పాటు బలమైన ఈదురు గాలులు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఇదే దిశలో ప్రయాణించి, 3వ తేదీన దక్షిణ ఒడిశా - ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరాన్ని దాటవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ వాయుగుండం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దీనికి తోడు రాగల మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
IMD
India Meteorological Department
Andhra Pradesh rains
Telangana rains
Bay of Bengal cyclone
Heavy rainfall warning
Weather forecast
Coastal Andhra
Cyclone alert

More Telugu News