Headmaster: చెక్‌ రాయడం కూడా రాని వ్యక్తి హెడ్మాస్టరా?

Himachal Pradesh Headmasters Illiteracy Exposed in Viral Check Photo
  • హిమాచల్ ప్రదేశ్ లో ఓ హెడ్మాస్టర్ రాసిన చెక్కు ఫొటో వైరల్
  • చెక్ మొత్తం అక్షర దోషాలే 
  • మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లింపుల కోసం చెక్ రాసిచ్చిన హెచ్ఎం
  • ఆయన రాసిన పదాలకు అర్థం తెలియక చెక్కును ఆపేసిన బ్యాంకు సిబ్బంది
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా పిల్లలకు వండి వడ్డించే వారికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెల్లింపులు చేస్తారు. స్కూలు నిధుల నుంచి చెక్కుల ద్వారా ఈ చెల్లింపులు జరుగుతుంటాయి. అయితే, ఒక చెక్కుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చెక్కుపై రాసిన పదాలు ఒక్కటి కూడా సరిగా లేకపోవడమే కారణం.

స్కూలు హెడ్మాస్టర్ రాసిచ్చిన చెక్ లో అక్షర దోషాలు ఉండడం.. రాసిన ఐదారు పదాలలో ఒక్కటి తప్ప మిగతావన్నీ తప్పులుగా ఉండటంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘చెక్ కూడా సరిగ్గా రాయలేని ఈ వ్యక్తి ఓ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఎలా అయ్యాడు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మేధావులు ఉంటారనే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడంలేదని, ఆర్థికంగా భారమైనా సరే ప్రైవేటు పాఠశాలలకే పంపిస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.
 
అసలు ఏంజరిగిందంటే..
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు హెడ్మాస్టర్ గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల ఓ చెక్ రాసిచ్చాడు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లించాల్సిన రూ.7,616 లకు చెక్ ఇచ్చాడు. ఈ మొత్తాన్ని అక్షరాల్లో రాయాల్సిన చోట సదరు హెచ్ఎం ‘‘సావెన్ థర్స్‌డే సిక్స్ హరేంద్ర సీక్స్ ఓన్లీ’’ అని రాశారు. ఈ తప్పుల కారణంగా బ్యాంకు అధికారులు ఆ చెక్కును తిరస్కరించారు. ఈ చెక్ ను గుర్తుతెలియని వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
Headmaster
Himachal Pradesh
government school
midday meal scheme
check bounce
viral photo
school funds
education system
teacher qualification
banking error

More Telugu News