Sangruram: 75 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. మర్నాడే ప్రాణం పోయింది!

75 Year Old Man Marries 35 Year Old Dies Before Honeymoon
  • ఒంటరితనం భరించలేక 75 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
  • తనకంటే సగం వయసున్న 35 ఏళ్ల మహిళతో వివాహం
  • పెళ్లి జరిగిన మరుసటి రోజు ఉదయమే వరుడు మృతి
  • వృద్ధుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు
  • ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పుర్ జిల్లాలో ఈ ఘటన
ఒంటరి జీవితానికి ముగింపు పలకాలని, వృద్ధాప్యంలో తోడు కోసం 75 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. పెళ్లైన మరుసటి రోజు ఉదయమే ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పుర్ జిల్లా కుచ్‌ముచ్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... సంగ్రురామ్ (75) అనే వృద్ధుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఏడాది క్రితం అతని మొదటి భార్య చనిపోయింది. పిల్లలు లేకపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ వయసులో పెళ్లెందుకని కుటుంబ సభ్యులు వారించినా, ఒంటరితనాన్ని భరించలేక వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన మన్‌భవతి (35) అనే మహిళను సోమవారం, సెప్టెంబర్ 29న వివాహం చేసుకున్నాడు. ముందుగా కోర్టులో వివాహాన్ని రిజిస్టర్ చేయించుకుని, ఆ తర్వాత స్థానిక ఆలయంలో సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు.

పెళ్లి తర్వాత నవ వధువు మన్‌భవతి మాట్లాడుతూ.. ఇంటి బాధ్యతలు తాను చూసుకోవాలని, ‘పిల్లల సంగతి’ తాను చూసుకుంటానని తన భర్త హామీ ఇచ్చినట్లు తెలిపింది. పెళ్లి రాత్రి చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నామని ఆమె చెప్పింది. అయితే, మరుసటి రోజు ఉదయం సంగ్రురామ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఆకస్మిక మరణం గ్రామంలో అనేక అనుమానాలకు తావిస్తోంది. వయసు మీద పడటంతో సహజంగానే మరణించి ఉంటాడని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం ఆయన మృతి వెనుక ఏదో మర్మం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో నివసించే సంగ్రురామ్ మేనల్లుళ్లు ఈ విషయం తెలుసుకుని, తాము వచ్చేవరకు అంత్యక్రియలు జరపవద్దని అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేసి, పోస్టుమార్టం నిర్వహిస్తారా? లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Sangruram
Uttar Pradesh
second marriage
old age
death
bride
Jaunpur district
Manbhavati
court marriage
traditional wedding

More Telugu News