Tamil Nadu Police: అరుణాచలంలో దారుణం.. ఏపీ యువతిపై త‌మిళ‌నాడు పోలీసుల అఘాయిత్యం

Arunachalam Rape Case AP Woman Assaulted by Tamil Nadu Police
  • రక్షక భటులే భక్షకులుగా మారిన వైనం
  • ఇద్దరు తమిళనాడు కానిస్టేబుళ్ల సామూహిక అత్యాచారం
  • శ్మశానానికి తీసుకెళ్లి అఘాయిత్యం
  • అక్కను బెదిరించి చెల్లిపై ఘాతుకం
  • నిందిత కానిస్టేబుళ్లు సుందర్‌, సురేశ్‌రాజ్‌ అరెస్ట్
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే భక్షకులుగా మారిన అత్యంత దారుణమైన ఘటన తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో చోటుచేసుకుంది. దర్శనం కోసం ఏపీ నుంచి వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. రక్షకులే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరువణ్ణామలై బైపాస్ రోడ్డులో సుందర్‌, సురేశ్‌రాజ్‌ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ లోడు వాహనాన్ని ఆపి, అందులో ప్రయాణిస్తున్న 20, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిందకు దించారు.

తెలుగులో మాట్లాడుతున్న వారిని ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని అక్కడి నుంచి పంపించివేసి, ఆ యువతులను తమ ద్విచక్రవాహనాలపై ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏందల్‌ అనే ప్రాంతంలోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ అక్కను భయపెట్టి పక్కన కూర్చోబెట్టి, ఆమె కళ్లెదుటే చెల్లిపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

మంగళవారం ఉదయం, ఆ ప్రాంతంలో భయంతో రోదిస్తున్న అక్కాచెల్లెళ్లను చూసిన స్థానికులు వెంటనే వారిని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితురాలి అక్క జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియగానే ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కానిస్టేబుళ్లు సుందర్‌, సురేశ్‌రాజ్‌లను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Tamil Nadu Police
Arunachalam rape case
Andhra Pradesh woman
police misconduct
sexual assault
crime news
Tiruvannamalai
police abuse of power
India crime
police investigation

More Telugu News