Karthik: వీడొక వింత దొంగ.. ఆడవాళ్ల లోదుస్తులే టార్గెట్!

Underwear Thief Karthik Arrested in Karnataka
  • హుబ్బళ్లిలో మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి అరెస్ట్
  • వారం రోజులు తన దగ్గర ఉంచుకుని తిరిగి విసిరేస్తున్న నిందితుడు
  • గాలికి కొట్టుకుపోతున్నాయనుకుంటే.. సీసీటీవీతో వెలుగులోకి వచ్చిన నిజం
  • నిందితుడి వికృత చేష్టలతో మహిళల్లో తీవ్ర భయాందోళన
  • సౌండ్ సిస్టమ్ షాపులో పనిచేస్తున్న కార్తీక్‌గా గుర్తింపు
కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలో ఓ విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళల లోదుస్తులనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని బెండిగేరి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వికృత చేష్టలు తెలియడంతో స్థానిక మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. హుబ్బళ్లిలోని వీరాపుర ఓణి ప్రాంతంలో గత నెల రోజులుగా వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇళ్లలో ఆరుబయట దండెంపై ఆరవేసిన మహిళల లోదుస్తులు తరచూ మాయమవుతున్నాయి. మొదట అందరూ గాలికి కొట్టుకుపోయి ఉంటాయని భావించారు. అయితే, ఇదే తంతు పదే పదే జరగడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు తమ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

ఆ ఫుటేజీలో కనిపించిన దృశ్యాలు చూసి స్థానికులు నిర్ఘాంతపోయారు. ఓ వ్యక్తి రాత్రిపూట ఇళ్ల బాల్కనీలు, టెర్రస్‌లపైకి ఎక్కి, ఆరవేసిన లోదుస్తులను దొంగిలించి ప్యాంటు జేబులో పెట్టుకుని వెళ్లడం స్పష్టంగా రికార్డయింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని తంతి నగర్‌కు చెందిన కార్తీక్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతను స్థానికంగా ఓ సౌండ్ సిస్టమ్ దుకాణంలో పనిచేస్తున్నట్లు తెలిపారు.

పోలీసుల విచారణలో కార్తీక్ తన నేరాన్ని అంగీకరించాడు. దొంగిలించిన లోదుస్తులను సుమారు వారం రోజుల పాటు తన వద్దే ఉంచుకుని, ఆ తర్వాత తిరిగి ఆయా ఇళ్ల ఆవరణలోకి విసిరేస్తున్నట్లు చెప్పడం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. పదో తరగతి వరకు చదువుకున్న కార్తీక్ మానసికంగా వికృత ప్రవర్తనతో ఇలా చేస్తున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళలు, నిందితుడి చర్యలు ఒకప్పటి కరడుగట్టిన సైకో కిల్లర్ ఉమేశ్ రెడ్డిని గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Karthik
Hubli
Karnataka
women's underwear
theft
Weerapura Oni
Tanti Nagar
Umesh Reddy
crime
CCTV footage

More Telugu News