Raasi: నా కెరియర్ ను దెబ్బతీసిన సినిమా అది: రాశి

Raasi Interview
  • 1990లలో హీరోయిన్ గా ఎంట్రీ 
  • వరుస హిట్స్ తో విపరీతమైన క్రేజ్ 
  • 'నిజం' సినిమాను గురించిన ప్రస్తావన 
  • ఆ సంఘటనను మరిచిపోలేనని వెల్లడి    

1990లలో తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన కథానాయికలలో రాశి ఒకరు. బాలనటిగా అనేక సినిమాలలో నటించిన రాశి, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస విజయాలను అందుకుంటూ వెళ్లారు. శుభాకాంక్షలు .. గోకులంలో సీత .. స్నేహితులు సినిమాలు ఆమెకి విపరీతమైన స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. అలాంటి రాశి రీసెంట్ గా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

'నిజం' సినిమా కోసం నన్ను తేజ గారు ఆఫీసుకి పిలిపించి మాట్లాడారు. ఆయన నా పాత్రను గురించి చెప్పారు. నేను కాస్త బరువు తగ్గాలని చెప్పి ట్రైనర్ ని కూడా పెట్టారు. మేకప్ లేకుండా నేను ఆ సినిమాను చేశాను. చేయకూడని సీన్ ను ఫస్టు రోజునే షూట్ చేశారు. ఈ సీన్ గురించి నాకు ముందుగా చెప్పలేదు గనుక నేను చేయనని చెప్పాను. బాబురావు గారు నచ్చజెప్పడంతో అయిష్టంగానే చేశాను. ఆ తరువాత తేజగారు 'సారీ' చెప్పినా, నేను దానిని అంగీకరించనని అన్నాను" అని చెప్పారు. 

"ఆ పాత్ర చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటుందని నాకు అనిపించింది. నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అనిపించింది. నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఆ సినిమా తరువాత నా కెరియర్ పోయింది. మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో ఒకరు అడిగారు. ఇండస్ట్రీలో ఏ దర్శకుడినైనా మరిచిపోవాలని అనుకుంటే, ఏ డైరెక్టర్ ని మరిచిపోతారు అని. అప్పుడు వాళ్లకి నేను 'తేజ' పేరు చెప్పాను. ఆ సినిమా తరువాత తేజ సినిమాలకి నేను పనిచేశాను. కాకపోతే ఆ సినిమా విషయంలో ఇలా జరిగిందనేది మాత్రం 'నిజం' అని అన్నారు. 

Raasi
Raasi interview
Telugu actress Raasi
Nijam movie
Teja director
Raasi career
Telugu cinema
actress career decline
controversial scene
Tollywood

More Telugu News