Mirage Malayalam movie: ఓటీటీ తెరపైకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ .. 'మిరాజ్'

Mirage Movie Updte
  • మలయాళంలో రూపొందిన 'మిరాజ్'
  • ప్రధానమైన పాత్రల్లో అసిఫ్ - అపర్ణ బాలమురళి 
  • ఈ నెల 19న విడుదలైన సినిమా 
  • అక్టోబర్ 23న సోనీలివ్ లో అందుబాటులోకి 

మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన సినిమాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మలయాళ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావడానికి ఆయా సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన 'మిరాజ్' ఇప్పుడు ఓటీటీ తెరపైకి రావడానికి రంగం సిద్ధమవుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఓటీటీ హక్కులను 'సోనీ టీవీ'వారు దక్కించుకున్నారు. 

'మిరాజ్' అంటే 'ఎండమావి' అని అర్థం. అంటే దూరంగా నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది .. కానీ దగ్గరికి వెళితే అక్కడ ఏమీ ఉండవు. మళ్లీ కాస్త ముందున నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనినే ఎండమావి అని అంటారు. ఈ కథ కూడా ఇలాగే సాగుతూ ఉంటుంది. అసిఫ్ అలీ .. అపర్ణ బాలమురళి .. హకీమ్ షాజహాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 19వ థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 23వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. 

కథలోకి వెళితే ..  కిరణ్ ఓ కన్సల్టెన్సీ కి సంబంధించిన సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజున అతను కనిపించకుండాపోతాడు. భార్య అభిరామి అతని గురించి తెలుసుకోవడానికి ఆ సంస్థకు వెళితే వాళ్లు సరైన సమాధానం ఇవ్వరు. దాంతో ఆమె అశ్విన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ను ఆశ్రయిస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది కథ. 

Mirage Malayalam movie
Asif Ali
Aparna Balamurali
Hakim Shajahan
Jeethu Joseph
Sony Liv
OTT release
Malayalam crime thriller
Mirage movie review
Malayalam movies online

More Telugu News