Suryakumar Yadav: ఆసియా కప్ విజయం.. ప్రధాని మోదీపై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Suryakumar Yadav Praises Narendra Modi After Asia Cup Win
  • నాయకుడు స్వయంగా ముందు వరుసలో ఉండి బ్యాటింగ్ చేసినప్పుడు బాగుంటుందన్న సూర్యకుమార్
  • ఆయన బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు చేసినట్లు అనిపించిందని వ్యాఖ్య
  • సార్ ముందు నిలబడి ఉన్నప్పుడు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతారన్న సూర్యకుమార్
భారత క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశ నాయకుడు స్వయంగా ముందువరుసలో ఉండి బ్యాటింగ్ చేసినప్పుడు చాలా బాగుంటుందని తెలిపాడు. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన అనంతరం ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.

'మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్, ఎక్కడైనా ఫలితం ఒక్కటే' అంటూ ప్రధాని చేసిన ట్వీట్‌పై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.

ప్రధాని మోదీ బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు చేసినట్లు అనిపించిందని, ఇది చూడటానికి చాలా బాగుందని వివరించాడు. సార్ ముందు నిలబడి ఉన్నప్పుడు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడతారని సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. తాము విజయం సాధించి స్వదేశానికి వెళ్లినప్పుడు ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారని, ఇది తమకు మరింత ప్రేరణను ఇస్తుందని అన్నాడు.
Suryakumar Yadav
Narendra Modi
Asia Cup 2024
India vs Pakistan
Cricket
Indian Cricket Team

More Telugu News