Shashi Tharoor: ఆసియా కప్ విజయంపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shashi Tharoor Comments on Asia Cup Victory
  • ఈ విజయం వెనక కోచ్, సెలెక్టర్ల కృషి కూడా ఉందన్న ఎంపీ
  • విజయోత్సవాల్లో వారి కృషి మరుగున పడిపోతుందని వ్యాఖ్య
  • జట్టు ఓడిపోతే తొలుత నిందలు మోసేది వారేనన్న శశిథరూర్
ఆసియా కప్ ఫైనల్ విజేతగా నిలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు సోషల్ మీడియా వేదికగా టీమిండియా క్రికెటర్లకు అభినందనలు తెలియజేస్తున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులు మైదానంలో జరుపుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ విజయోత్సవాల వెనక కొందరి కృషి మరుగున పడిపోతోందని, వారికి తగిన గుర్తింపు లభించడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. జట్టు కనుక ఓటమి పాలైతే తొలుత నిందలు మోసేది కోచ్, ఆ తర్వాత సెలెక్టర్లేనని ఎంపీ గుర్తుచేశారు. అందరూ క్రికెటర్లను ప్రశంసిస్తున్నారే తప్ప.. ఎవరూ తెర వెనక కృషిని పట్టించుకోవట్లేదని, కోచ్‌ గంభీర్‌, టీమ్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లను కూడా అభినందించాలని అన్నారు.

జట్టు తప్పు చేస్తే ఎప్పుడూ వారే నిందలు పడతారని.. అదే టీం విజయం సాధించినప్పుడు మాత్రం ఎవరూ వారిని పట్టించుకోరని పేర్కొన్నారు. ఆసియా కప్ లో భారత్ ను విజేతగా నిలిపిన ఆటగాళ్లతో పాటు వారిని తుది జట్టులోకి ఎంపిక చేసిన సెలెక్టర్లను, వారికి కోచింగ్ ఇచ్చిన గంభీర్ ను అభినందిద్దాం అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు.
Shashi Tharoor
Asia Cup 2023
India Cricket Team
Gautam Gambhir
Cricket Selectors
Indian Cricket
Cricket Coach
Asia Cup Victory
Team India
Cricket Team Selection

More Telugu News