Nagarjuna: నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

Revanth Reddy Praises Nagarjuna for Land Donation
  • తుమ్మిడికుంట ప్రాంతంలో నాగార్జున అక్రమ నిర్మాణం ఎన్ కన్వెన్షన్ సెంటర్
  • హైడ్రా కూల్చివేతల అనంతరం నాగార్జున నిజం గ్రహించారన్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఆక్రమిత భూమి ప్రభుత్వానికి నాగార్జున అప్పగించారన్న రేవంత్ రెడ్డి
సినీ హీరో అక్కినేని నాగార్జునను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రెండు ఎకరాల తుమ్మిడికుంట చెరువు ఆక్రమిత స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేయడంతో పాటు చెరువు అభివృద్ధికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెరువు పునరుద్ధరణ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలిసో తెలియకో నాగార్జున చెరువు ప్రాంతంలో కన్వెన్షన్ హాల్ నిర్మించారని, హెచ్‌ఎండీఏ అధికారులు ఈ నిర్మాణాన్ని కూల్చిన తర్వాత, వివరాలు తెలియజేయగానే ఆయన వాస్తవం గ్రహించారు. తరువాత ఆయన స్వచ్ఛందంగా ఆక్రమించిన రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు.

బతుకమ్మకుంట పునరుద్ధరణకు రూ.7.15 కోట్లు

అంబర్‌పేటలో 14.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మకుంట చెరువును హెచ్‌ఎండీఏ పునరుద్ధరించింది. చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, రూ. 7.15 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, హెచ్‌ఎండీఏ కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏపై రూపొందించిన పాటను సీఎం ఆవిష్కరించారు. 
Nagarjuna
Revanth Reddy
Telangana
Hyderabad
Tummidikunta Lake
Bathukamma Kunta Lake
Lake Restoration
GHMC
Ponnam Prabhakar
HYDRA

More Telugu News