Niharika Konidela: నేను ఫ్యామిలీతో కలిసి ఉండడడం లేదు: నిహారిక

Niharika Konidela says she is living separately from family
  • పర్సనల్ లైఫ్‌తో పాటు ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న నిహారిక
  • ఫ్యామిలీ నుంచి వేరుగా ఉంటున్నా రెండు రోజులకు ఒక సారి ఇంటికి వెళ్లి వస్తున్నానన్న నిహారిక
  • కల్యాణ్ బాబాయ్ ఓజీ మూవీ తాము ఊహించిన దాని కంటే వేరే లెవల్‌లో ఉందన్న నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం తాను వేరుగా నివసిస్తున్నానని, కుటుంబానికి దూరం కాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే నిహారిక, ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను విడిగా ఉంటున్నప్పటికీ, రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తుంటానని, వారే తన జీవితమని ఆమె పేర్కొన్నారు.

"మా అన్న వరుణ్ తేజ్‌కు కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి నేను చాలా బిజీ అయ్యాను. మా అల్లుడిని ఎత్తుకుని తిరుగుతున్నాను. అందుకే ఇప్పుడు నాకు ఎవరూ పనులు చెప్పడం లేదు. సాధారణంగా 'నీళ్లు తీసుకురా', 'అది తీసుకురా' అంటూ ఏదో ఒక పని చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరూ ఏమీ అనడం లేదు" అని ఆమె నవ్వుతూ తెలిపారు.

మా అల్లుడు పెద్దయ్యాక నటుడు అవుతానంటే తప్పకుండా తన బ్యానర్‌లోనే సినిమా తీస్తానని నిహారిక అన్నారు. ఇటీవల కల్యాణ్ బాబాయ్ 'ఓజీ' చిత్రం విడుదలైంది. ఆ సినిమా ప్రభావంతో ఇంట్లో అందరికీ 'ఓజీ' ఫీవర్ పట్టుకుంది. ఆ చిత్రం మేము ఊహించిన దానికంటే ఉన్నత స్థాయిలో ఉందని నిహారిక కొనియాడారు. 
Niharika Konidela
Niharika
Mega Daughter
Varun Tej
OG Movie
Kalyan babu
Family
Tollywood
Telugu cinema
Entertainment

More Telugu News