Shyamala: అయ్య బాబోయ్... అది మామూలు జ్వరం కాదట!: యాంకర్ శ్యామల

Shyamala comments on Pawan Kalyans viral fever
  • గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ కు వైరల్ జ్వరం
  • ఆ జ్వరం ఇప్పట్లో తగ్గదన్న శ్యామల
  • పీపీపీ గారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆరోగ్యంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో, ఆయన ఆరోగ్యాన్ని ప్రస్తావిస్తూ శ్యామల సెటైర్లు విసిరారు. 

"అయ్యబాబోయ్... అది మామూలు జ్వరం కాదట...! విశాఖ ఉక్కును, మెడికల్ కాలేజీలను పూర్తిగా అమ్మేసే వరకు... రైతులు, ఆటో కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పిఠాపురంలో మత్స్యకారులు, చిరు అభిమానులు శాంతించే వరకు ... ఆయనకి జ్వరం తగ్గదట!" అంటూ శ్యామల ట్వీట్ చేశారు. అంతేకాదు, పీపీపీ గారు త్వరగా కోలుకోవాలి అంటూ కూడా ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Shyamala
Pawan Kalyan
Janasena
YSJagan
Andhra Pradesh Politics
Viral Fever
Visakha Steel Plant
Pithapuram
AP Deputy CM
Political Satire

More Telugu News