Vijay: నటుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట.. పలువురు మృతి

Actor Vijay Rally Stampede Kills Several in Karur
  • కరూర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో తీవ్ర విషాదం
  • మరణించిన వారిలో కార్యకర్తలతో పాటు చిన్నారులు
  • బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని స్టాలిన్ ఆదేశాలు
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన కరూర్‌లో జరిగింది.

విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పది మంది వరకు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన కారణంగా విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేయవలసి వచ్చింది. అంబులెన్సులు వెళ్లడానికి దారి ఇవ్వాలని విజయ్ కార్యకర్తలను, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. కరూర్ నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Vijay
Vijay political rally
Tamilaga Vettri Kazhagam
Karur stampede
Tamil Nadu politics
MK Stalin

More Telugu News