Heavy rains in Hyderabad: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం... అంబర్‌పేటలో ఇళ్లలోకి నీరు
- జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం
- పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- పూర్తిగా నీటమునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ రోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది. మూసారాంబాగ్, గోల్నాక బ్రిడ్జిలను అధికారులు మూసివేశారు. ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా నీట మునిగింది. అంబర్ పేటతో సహా పలు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరింది.