Surya Sethupathi: ఓటీటీ తెరపైకి సూర్య సేతుపతి మూవీ!

Phoenix Movie Update
  • సూర్య సేతుపతి హీరోగా 'ఫీనిక్స్'
  • జులైలో విడుదలైన సినిమా
  • స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కంటెంట్  
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి
  
తమిళంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకున్న సినిమా పేరు 'ఫీనిక్స్'. అందుకు కారణం ఈ సినిమాలో హీరో, విజయ్ సేతుపతి కొడుకు సూర్య కావడమే. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన సత్తా చాటుకున్న నటుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ వైపు నుంచి ఆయనకి విపరీతమైన మద్దతు ఉంది. అలాంటి విజయ్ సేతుపతి వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం గురించే అంతా మాట్లాడుకున్నారు. 

స్టంట్ మాస్టర్ గా అనేక చిత్రాలకు పనిచేసిన అనల్ అరసు, దర్శకుడిగా రూపొందించిన సినిమా ఇది. తన సొంత బ్యానర్లో ఆయన ఈ సినిమాను నిర్మించాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 4వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాలో, వర్ష - అభినక్షత్ర ముఖ్యమైన పాత్రలను పోషించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటించింది. 

విజయ్ సేతుపతి తనయుడి సినిమా కావడం .. అతని నటన ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ..  వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ రోల్ ను పోషించడం .. ఈ సినిమాపై కుతూహలాన్ని పెంచుతూ వెళ్లాయి. మొదటి ప్రయత్నంలో అతను పాస్ మార్కులు కొట్టేసినట్టుగా చెప్పుకున్నారు. అలాంటి ఈ సినిమా, ఈ నెల 26వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చూడాలి మరి ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తాడో. 

Surya Sethupathi
Phoenix Movie
Vijay Sethupathi
Tamil Movie
OTT Release
Amazon Prime
Varalaxmi Sarathkumar
Anal Arasu
Sports Drama

More Telugu News