Moshen Raju: ఏపీ మండలిలో కాఫీ వివాదం

Coffee Row Erupts in Andhra Pradesh Legislative Council
––
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇచ్చే కాఫీకి, మండలిలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందని మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆరోపించారు. రెండు చోట్ల ఒకే నాణ్యతతో ఆహార పదార్థాలు అందించాలని ఆయన కోరారు. కాఫీ, భోజనాల విషయంలో అసెంబ్లీకి,మండలికి వివక్ష చూపించడంపై వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ మోషెన్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ విషయంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులు సభను స్తంభింపచేశారు. దీంతో ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అయితే, అలాంటి తేడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇచ్చారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Moshen Raju
AP Legislative Council
Andhra Pradesh Assembly
Coffee
Payyavula Keshav
AP Politics
Assembly Food
Council Food

More Telugu News