Vijayawada Highway: దసరా ఎఫెక్ట్.. విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. వీడియో ఇదిగో!

Vijayawada Highway traffic jam due to Dasara festival
––
దసరా పండుగ సందర్భంగా నగరవాసులు స్వగ్రామాలకు తరలివెళ్లడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలు సైతం రోడ్డెక్కడంతో విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హయత్ నగర్ లో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఉప్పల్‌ చౌరస్తా వద్ద కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి వద్ద భారీ వర్షాల కారణంగా వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెన వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. వంతెనకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనలు నిలిచిపోయాయి.

Vijayawada Highway
Dasara festival
Hyderabad traffic
Vijayawada traffic
Highway traffic jam
Gourelli
Abdullapurmet
Uppal Chowrasta
Hayath Nagar
Telangana rains

More Telugu News