Eric Schmidt: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విధానంపై గూగుల్ మాజీ సీఈవో కీలక వ్యాఖ్యలు

Eric Schmidt comments on work life balance policy
  • వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విధానానికి అతి ప్రాధాన్యత ఇస్తే పోటీతత్వం దెబ్బతింటుందని వ్యాఖ్య
  • టెక్ రంగంలో విజయం సాధించాలంటే రాజీ పడాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • అమెరికా సాంకేతిక రంగం చైనా నుంచి సవాలును ఎదుర్కొంటుందన్న ఎరిక్ స్మిత్
టెక్ రంగంలో విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుందని, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విధానానికి అతి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పోటీతత్వం దెబ్బతింటుందని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ అన్నారు.

ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, అదే సమయంలో ఇంట్లో ఉండి పని చేయడం వల్ల నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మార్గదర్శకత్వ లోటు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇది ఆవిష్కరణపై ప్రభావం చూపుతుందని ఎరిక్ స్మిత్ అన్నారు.

అమెరికా సాంకేతిక రంగం చైనా నుంచి సవాలు ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరించారు. అక్కడ చాలా సంస్థలు '9-9-6' పని సంస్కృతిని అవలంబిస్తుంటాయని తెలిపారు. అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆరు రోజుల పాటు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. అధిక పని గంటలకు వ్యతిరేకంగా అక్కడ చట్టాలు ఉన్నప్పటికీ ఈ విధానం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా అమెరికా వ్యాపారాలు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
Eric Schmidt
Google
Work life balance
Work from home
China
996 work culture
Technology

More Telugu News