Ameesha Patel: అందరూ నా బాడీ చూశారే తప్ప... నా మనను చూడలేదు: అమీషా పటేల్

Ameesha Patel Reveals Reason for Being Single at 50
  • తన పెళ్లిపై స్పందించిన నటి అమీషా పటేల్
  • తాను డేటింగ్ చేసిన వారిలో నిజాయతీ లోపించిందని వెల్లడి
  • సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని ఉందన్న అమీషా
తెలుగు ప్రేక్షకులకు 'బద్రి', 'నాని' చిత్రాలతో సుపరిచితురాలైన సీనియర్ బాలీవుడ్ నటి అమీషా పటేల్, 50 ఏళ్ల వయసులోనూ తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఆమె తొలిసారిగా వివరించారు.

గతంలో తాను చాలా మందితో డేటింగ్ చేశానని, అయితే వారిలో ఎవరి దగ్గరా నిజాయతీ కనిపించలేదని అమీషా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "నా జీవితంలో చాలా మందితో ప్రేమాయణం నడిపాను. కానీ ఎవరూ నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోలేదు. అందరూ నన్ను ఒక స్త్రీగా నా శరీరాన్ని మాత్రమే చూశారు. నా ఆలోచనలకు, నిర్ణయాలకు గౌరవం ఇవ్వలేదు" అని ఆమె తెలిపారు. నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఎదురుచూశానని, అందుకే సంబంధాలు పెళ్లి వరకు వెళ్లలేదని స్పష్టం చేశారు.

అయితే, తనకు ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందని అమీషా అన్నారు. "నాకు పెళ్లిపై నమ్మకం పోలేదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా మూడు ముళ్లు వేయించుకుంటాను. పిల్లల్ని కని, కుటుంబాన్ని ప్రారంభించాలని ఉంది" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం అమీషా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. 
Ameesha Patel
Ameesha Patel interview
Bollywood actress
Badri movie
Nani movie
Ameesha Patel marriage
Ameesha Patel relationship
Ameesha Patel age
Bollywood news
Telugu movies

More Telugu News