BSNL: రేపు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభం

BSNL 4G Services to Launch Nationwide Tomorrow
  • సేవలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • ఇది క్లౌడ్ ఆధారిత నెట్ వర్క్ అని కేంద్ర మంత్రి వెల్లడి
  • భవిష్యత్ అవసరాలకు తగినట్లు 5జీకి సులువుగా అప్ గ్రేడ్ కావొచ్చన్న మంత్రి
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలు రేపు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను శనివారం ప్రారంభించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇది క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ అని, భవిష్యత్ అవసరాలకు తగినట్లు 5జీకి సులువుగా అప్‌గ్రేడ్ అవ్వొచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

సెప్టెంబర్ 27న బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభోత్సవం జరగనుందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని జార్సుగూడా నుంచి ఈ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించనున్నారు. గౌహతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొంటారు.
BSNL
BSNL 4G
Narendra Modi
BSNL 4G launch
4G services India

More Telugu News