Teerala Sharan Bhagawan Reddy: డేటింగ్ యాప్‌లో పరిచయం.. వైద్యుడిని బ్లాక్‌మెయిల్ చేసి దోపిడీ చేసిన గే!

Hyderabad Doctor Blackmailed After Gay Dating App Meeting
  • మాదాపూర్‌లోని హాస్టల్‌కు పిలిచి అనుచిత ప్రవర్తన
  • దాడి చేసి, చంపుతానని బెదిరింపులు
  • బ్లాక్‌మెయిల్ చేసి పేటీఎం ద్వారా డబ్బుల వసూలు
  • ఫ్లాట్‌కు వెళ్లి పర్సులోని నగదు కూడా దోపిడీ
  • బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
సాంకేతికత పెరిగాక పరిచయాలు సులభమయ్యాయి, కానీ అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ వ్యక్తి చేతిలో వైద్యుడొకరు దారుణంగా మోసపోయిన ఘటన హైదరాబాద్ మాదాపూర్‌లో వెలుగుచూసింది. తన కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో ఆ వైద్యుడిపై దాడి చేసి, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజాడో యువకుడు.

పోలీసుల కథనం ప్రకారం, నగరానికి చెందిన ఓ వైద్యుడికి.. తేరాల శరణ్ భగవాన్‌రెడ్డి అనే వ్యక్తికి వారం రోజుల క్రితం ఒక గే డేటింగ్ యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్ని రోజులుగా చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21న కలుద్దామంటూ భగవాన్‌రెడ్డి ఆ వైద్యుడిని మాదాపూర్‌లోని ఓ హాస్టల్‌కు ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన వైద్యుడితో నిందితుడు అనుచితంగా ప్రవర్తించగా, వైద్యుడు అడ్డుకున్నాడు.

దీంతో ఆగ్రహానికి గురైన భగవాన్‌రెడ్డి వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, పనిచేస్తున్న ఆసుపత్రికి చెబుతానని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ హెచ్చరించాడు. భయపడిపోయిన వైద్యుడు వెంటనే పేటీఎం ద్వారా రూ. 5,000 బదిలీ చేశాడు. అంతటితో ఆగని నిందితుడు, బాధితుడి ఫోన్ లాక్కొని, అతని ఫ్లాట్‌కు వెళ్లి పర్సులో ఉన్న మరో రూ. 3,000 కూడా దోచుకున్నాడు.

నిందితుడి వేధింపులు భరించలేక బాధితుడు ఈ నెల 22న ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఆశ్రయించాడు. వారు ఈ కేసును మాదాపూర్ పోలీసులకు బదిలీ చేయగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Teerala Sharan Bhagawan Reddy
Hyderabad
Madhapur
Gay dating app
Blackmail
Doctor
Extortion
Crime
Cybercrime

More Telugu News