Kalvakuntla Kavitha: హర్యానాలో ప్రాంతీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కవిత

Kalvakuntla Kavitha Attends Regional Party Event in Haryana
  • ప్రాంతీయ పార్టీలకే తమ ప్రాంతాలపై ప్రేమ ఉంటుందన్న కవిత
  • రాబోయే రోజుల్లో ఇక్కడ ఐఎన్ఎల్‌డీ అధికారంలోకి రాబోతుందన్న కవిత
  • రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వాలని వేదిక పైనుంచి చౌతాలకు సూచన
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హర్యానాలో అక్కడి ప్రాంతీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ 112వ జయంతి వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీలకే తమ తమ ప్రాంతాలపై ప్రేమ ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇన్నేళ్లుగా పరిపాలన చేస్తున్నప్పటికీ హర్యానా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఈ దేశంలో, హర్యానాలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని ఆమె మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఐఎన్ఎల్‌డీ అధికారంలోకి రాబోతుందనే విశ్వాసం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

హర్యానా ప్రభుత్వం రైతులకు ఇచ్చే విద్యుత్ ద్వారా వారిపై తీవ్ర భారం మోపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అదే తెలంగాణలో కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఐఎన్ఎల్‌డీ అధినేత అభయ్ సింగ్ చౌతాలా రైతులకు హామీ ఇవ్వాలని కవిత వేదిక పైనుంచి సూచించారు.
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Indian National Lok Dal
INLD
Haryana politics
Chaudhary Devi Lal

More Telugu News