Mandi Rramprasad Reddy: జీఎస్‌టీ తగ్గింపుతో ఏపీలో జోరందుకున్న వాహనాల అమ్మకాలు

Mandi Rramprasad Reddy on AP Vehicle Sales Surge After GST Cut
  • పెరుగుతున్న వాహనాల రిజిస్ట్రేషన్ 
  • పన్ను భారం తగ్గడం, దసరా పండుగ సీజన్ కలిసి వచ్చిన వైనం
  • రోజుకు 4 వేల వాహనాలకుపైగా రిజిస్ట్రేషన్లు అవుతాయంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి  
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలు వాహన మార్కెట్‌కు ఊతమివ్వడంతో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. పన్ను భారం తగ్గడంతో పాటు దసరా పండుగ సీజన్ కలిసిరావడంతో వినియోగదారులు కొత్త వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గుదల వల్ల వినియోగదారులకు ఖర్చు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆ ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 2,352, కార్లు/క్యాబ్‌లు 241, ట్రాక్టర్లు 60, ఆటోలు 277, సరుకు రవాణా వాహనాలు 47, గూడ్స్ ఆటోలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నాయి. అదే విధంగా, మంగళవారం 3,500 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ క్రమంలో గురు, శుక్రవారాల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ స్పందన

వాహనాల అమ్మకాల పెరుగుదలపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. "జీఎస్టీ తగ్గడంతో వాహనాలపై పన్ను భారం తగ్గింది. దీని వల్ల ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. రోజుకు 4,000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందన్న అంచనాతో ఉన్నాం" అని ఆయన పేర్కొన్నారు. 
Mandi Rramprasad Reddy
Andhra Pradesh
AP GST
GST reduction
Vehicle sales
Dasara festival
Two-wheeler sales
Car sales
Transport department

More Telugu News