Telangana Talli Flyover: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం!

Telangana Government to Rename Telugu Talli Flyover as Telangana Talli Flyover
  • లోయర్ ట్యాంక్ బండ్ నుండి సచివాలయానికి కలుపుతూ ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్
  • తెలంగాణ తల్లిగా మార్చాలని నిర్ణయం
  • కార్పొరేషన్‌కు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లోయర్ ట్యాంక్ బండ్ నుండి సచివాలయం వరకు ఉన్న ఫ్లైఓవర్ పేరును మార్చాలని నిర్ణయించింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మార్చనున్నది. ఈ మేరకు కార్పొరేషన్‌కు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు కూడా ఉంది.
Telangana Talli Flyover
Telangana Talli
Telugu Talli Flyover
Hyderabad
GHMC
Gadwal Vijayalakshmi

More Telugu News