Nara Lokesh: మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం: నారా లోకేశ్

Nara Lokesh Committed to Establishing Junior Colleges in Every Mandal
  • శాసన సభలో సభ్యుల ప్రశ్నలకు నారా లోకేశ్ జవాబు
  • జూనియర్ కాలేజీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఫైర్
  • కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా చేసిందని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసన సభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై మంత్రి విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. హైస్కూలు ప్లస్ విధానంతో కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా చేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని ప్రక్షాళన చేశామని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో 40 శాతం అడ్మిషన్లు మెరుగుపరిచామని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేశ్ సభలో పేర్కొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Junior Colleges
Education
AP Assembly
YSRCP
Intermediate Education
Government Colleges
Education Reforms

More Telugu News