Mohanlal: ఓటీటీకి మోహన్ లాల్ హిట్ మూవీ!

Hridayapoorvam Movie Update
  • మోహన్ లాల్ నుంచి 'హృదయపూర్వం'
  • ఆగస్టు 28న విడుదలైన సినిమా 
  • 80 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన కంటెంట్ 
  • ఈ నెల 26 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

మోహన్ లాల్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, ఇప్పటికీ కూడా అక్కడి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తూ వచ్చిన కొన్ని సినిమాలు వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. నటన పరంగా ఆయనకి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అలాంటి మోహన్ లాల్ నుంచి వచ్చిన మరో సినిమానే 'హృదయ పూర్వం'.

ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. జస్టీన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. 

'హృదయపూర్వం' అనే టైటిల్ కి తగినట్టుగానే ఇది 'హృదయం' చుట్టూ తిరిగే కథనే. శ్రీమంతుడైన సందీప్ బాలకృష్ణన్ కి హార్ట్ సర్జరీ జరుగుతుంది. ఆ తరువాత కొంతకాలానికి అతను ఒక ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి వెళతాడు. ఎంగేజ్ మెంట్ చేసుకునే యువతి ఎవరో కాదు, తనకి ఎవరి గుండెనైతే అమర్చారో, ఆ వ్యక్తి కూతురు అనే విషయం సందీప్ బాలకృష్ణన్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

Mohanlal
Hridayam
Hridayam movie
Malayalam movies
OTT release
Jio Hotstar
Sathyan
Justin Prabhakaran
Sandeep Balakrishnan
Malayalam cinema

More Telugu News