Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు అస్వస్థత

Pawan Kalyan unwell with viral fever
  • వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్
  • రెండు రోజులుగా అస్వస్థత
  • విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వైరల్ జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ... ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈరోజు ఆయనకు జ్వరం మరింత పెరిగింది. దీంతో ఆయన వైద్యులను సంప్రదించారు.

ఉప ముఖ్యమంత్రికి వైద్యులు మెడికల్ టెస్టులు నిర్వహించారు. జ్వరం నుంచి కోలుకోవడానికి మందులు ఇవ్వడంతో పాటు... విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అధికారిక కార్యక్రమాలను రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని డిప్యూటీ సీఎంకు సూచించారు.
Pawan Kalyan
AP Deputy CM
Viral Fever
Pawan Kalyan Health
Andhra Pradesh Assembly
Medical Tests
Jana Sena
Political News

More Telugu News