Khushbu: చార్మినార్ వద్ద బతుకమ్మ ఆడిన ఖుష్బూ

Khushbu plays Bathukamma at Charminar
  • భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు
  • గౌరమ్మకు కుంకుమ పూజ చేసిన ఖుష్బూ
  • బతుకమ్మ వేడుకలో పాల్గొన్న బండ కార్తీక రెడ్డి
సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ హైదరాబాదులోని చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుష్బూ గౌరమ్మకు కుంకుమ పూజ నిర్వహించారు.

తెలంగాణ మహిళలందరికీ ఆమె బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బతుకమ్మ వేడుకలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకను తిలకించేందుకు, ఆడటానికి పెద్ద సంఖ్యలోమహిళలు తరలివచ్చారు.
Khushbu
Khushbu Sundar
Charminar
Bathukamma
Telangana
BJP Mahila Morcha
Bhagyalakshmi Temple

More Telugu News