Sandeep Kumar Jha: కలెక్టర్‌కు డ్రెస్ సెన్స్ లేదు.. ఆయనను చూస్తే భయంగా ఉంది: సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Sandeep Kumar Jha High Court Remarks on Siricilla Collector
  • ఇలాంటి వ్యక్తి ప్రజలకు సేవ ఎలా చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు
  • కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి ఆదేశాలు
  • గతంలోనూ ఆయన డ్రెస్సింగ్‌పై హైకోర్టు అసహనం
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్‌‍కు డ్రెస్సింగ్ సెన్స్ లేదని, ఆయనను చూస్తేనే భయంగా ఉందని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తి ప్రజలకు సేవ ఎలా చేస్తారని ప్రశ్నించింది. సిరిసిల్ల కలెక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నష్టపరిహారం చెల్లించకపోగా, ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి కవితపై అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ కవిత హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై గతంలో న్యాయస్థానానికి హాజరైనప్పుడు సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్‌పై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా, కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నలు సంధించింది. తాజాగా మరోసారి అదే విషయంపై అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పును యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
Sandeep Kumar Jha
Siricilla Collector
Telangana High Court
Dress code
Contempt of court
Mid Manair

More Telugu News