హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వివాహిత

  • నాగోల్ పరిధిలో ఉంటున్న అనిల్‌తో మహబూబాబాద్ జిల్లాకు చెందిన మహిళకు పరిచయం
  • కుమారుడికి చికిత్స కోసమని చెప్పి ప్రియుడి వద్దకు వచ్చిన మహిళ
  • ప్రియుడు కూరగాయలకు వెళ్లి వచ్చేసరికి మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో వివాహేతర సంబంధం ఒక మహిళ ప్రాణం తీసింది. ఆ మహిళ తన ప్రియుడి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని నాగోల్ పరిధిలో నివాసం ఉంటున్న అనిల్ నాయక్‌ (24) తో మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన ఒక మహిళకు (38) పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.

కొద్ది రోజుల క్రితం ఆమె తన మూడేళ్ల కుమారుడికి వైద్యం చేయిస్తానని ఇంట్లో చెప్పి నాగోల్ ప్రాంతంలోని ప్రియుడి ఇంటికి వచ్చింది. రెండు రోజులుగా ఆ మహిళ ప్రియుడి ఇంట్లోనే ఉంటోంది. సంఘటన జరిగిన సమయంలో అనిల్ కూరగాయల కోసం బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ మహిళ బాత్రూంలో హ్యాంగర్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది.

ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం గమనించిన అనిల్ వెంటనే తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్ళాడు. అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచింది. చుట్టుపక్కల వారిని సహాయం కోసం పిలిస్తే పరువు పోతుందని భావించిన అనిల్, ఆమె చీరతో ఉరివేసుకుంటున్నట్లు చూసినప్పటికీ ఎవరికీ చెప్పలేదు.

భయపడిన అనిల్ ఆ తర్వాత తన చేతిని కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అనంతరం అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. మహిళ మృతికి అనిలే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News