Savitri: సావిత్రి, రాజబాబు పేదరికంతో కాదు... పేరుతో పోయారు: చిట్టిబాబు

Chitti Babu Interview
  • ఒకప్పుడు సావిత్రమ్మ వైభవం వేరు 
  • ఫారిన్ కారులో తీసుకొస్తుంటే చాలా బాధపడ్డారు
  • ఎప్పటికీ నిలిచిపోయేది కీర్తి ప్రతిష్ఠలే
  • డబ్బు ఎవరూ తీసుకుపోలేరన్న చిట్టిబాబు

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన తారలలో చిత్తూరు నాగయ్య .. సావిత్రి .. రాజబాబు కనిపిస్తారు. నటన పరంగా .. దాతృత్వం పరంగా కూడా ఈ ముగ్గురూ కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. అడిగినవారికి లేదనకుండా సాయం చేసిన వారి జాబితాలో ఈ ముగ్గురూ కనిపిస్తారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముగ్గురిని గురించి రాజబాబు సోదరుడు చిట్టిబాబు ప్రస్తావించారు.

"చిత్తూరు నాగయ్య .. సావిత్రిగారి వైభవాన్ని చూసినవాడినే నేను. సావిత్రిగారితో అన్నయ్యకి గల సాన్నిహిత్యం కారణంగా ఆమెతో నాకు మరింత పరిచయం ఉంది. ఒకసారి ఆమెకి అన్నయ్య సన్మానం చేశారు. ఆ కార్యక్రమానికి ఆమెను తీసుకుని రావడానికి మేము ఫారిన్ కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లాము. అప్పుడు సావిత్రి గారి అబ్బాయి సతీశ్ చిన్నపిల్లాడు. అతను 'అమ్మా ఈ కారు పేరు ఏమిటి? అని సావిత్రి గారిని అడిగాడు. సతీశ్ పుట్టకముందు తన దగ్గర ఉండే ఫారిన్ కార్లను గురించి చెబుతూ సావిత్రిగారు ఏడ్చేసింది" అని అన్నారు. 

"వాళ్లంతా మహానటులు .. చివరి రోజులలో వాళ్ల దగ్గర డబ్బు లేకపోవచ్చు. కానీ సినిమా అనే మూడు అక్షరాలు ఉన్నంత వరకూ వాళ్లు జీవించి ఉన్నట్టే. వాళ్లు పేదరికంతో పోలేదు .. పేరుతో పోయారు. ఎంత డబ్బుంటే ఏమిటి ప్రయోజనం? .. ఎవరు దానిని పట్టుకుపోగలరు?. పొలాలు .. స్థలాలు .. కార్లు .. బంగ్లాలు .. వీటితో ఎప్పటికీ ఉండిపోతామని అనుకోవడం భ్రమ. ఏదైతే మనతో వస్తుందో అదే కదా నిజమైన ఆస్తి" అంటూ చిట్టిబాబు ఉద్వేగానికి లోనయ్యారు. 

Savitri
Rajababu
Chittor Nagayya
Chittibabu
Telugu cinema
Tollywood
Philanthropy
Suman TV interview
Celebrity deaths
Telugu actors

More Telugu News