Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ నివాసంలో కస్టమ్స్ రెయిడ్

Dulquer Salmaan Prithviraj Sukumaran Residences Raided in Car Smuggling Case
  • పృథ్విరాజ్ సుకుమారన్ నివాసంలోనూ సోదాలు
  • పన్ను ఎగవేత ఆరోపణలపై కస్టమ్స్ అధికారుల స్పందన
  • ‘ఆపరేషన్‌ నమకూర్‌’ పేరుతో కేరళలో 30 చోట్ల సోదాలు
మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ అధికారులు రెయిడ్ చేశారు. ఈ రోజు ఉదయం కోచిలోని వారి నివాసాల్లో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ‘ఆపరేషన్‌ నమకూర్‌’ చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్‌, పృథ్విరాజ్‌ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 చోట్ల సోదాలు జరుపుతున్నారు.

ఓ ఆన్ లైన్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. లగ్జరీ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా తెప్పించుకున్నారని దుల్కర్, పృథ్విరాజ్ లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు భూటాన్ ఆర్మీకి చెందిన హైఎండ్ వాహనాలను కొనుగోలు చేసి అక్రమంగా రీసేల్ చేసే గ్యాంగు నుంచి నటులు వాహనాలను కొనుగోలు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

భూటాన్ లో నిర్వహించే వేలంలో ఖరీదైన వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్ లోకి తీసుకొచ్చి సెలబ్రెటీలకు అమ్మడమే ఈ ముఠా పని అని తెలుస్తోంది. కాగా, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసంలో జరిపిన సోదాల్లో అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం.
Dulquer Salmaan
Prithviraj Sukumaran
Customs raid
Kerala
Luxury car smuggling
Operation Namakool
Bhutan
Malayalam actors
Tax evasion

More Telugu News