Bathula Prabhakar: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్

Bathula Prabhakar Escapes Police Custody in Andhra Pradesh
  • విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తుండగా పరార్ 
  • దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం సమీపంలో ఘటన
  • నిందితుడి సమాచారం అందించిన వారికి తగిన పారితోషకం అందిస్తామన్న పోలీసులు
పోలీసుల అదుపులో ఉన్న మోస్ట్‌వాంటెడ్ నిందితుడు బత్తుల ప్రభాకర్ పోలీస్ కస్టడీ నుంచి పరారైన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అతన్ని తరలిస్తుండగా, దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం సమీపంలోని ఒక దాబా వద్ద భోజనం కోసం ఆగిన సమయంలో అతను పోలీసులను తప్పించుకుని పరారయ్యాడు.
 
రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 35 సంవత్సరాల వయసు ఉండే ప్రభాకర్, పరారైన సమయంలో అతని చేతికి హ్యాండ్‌కఫ్స్ ఉండగా, అతను వెండి రంగు టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు.
 
తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు

బత్తుల ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకునే సమయంలో, అతను పోలీసులపై కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల పోలీసు స్టేషన్లకు అలర్ట్ జారీ చేశారు.
 
పరారైన ఘటనపై హై అలర్ట్
 
ఈ పరిణామాల నేపథ్యంలో రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే ఇన్‌స్పెక్టర్ దేవరపల్లి - 9440796584 లేదా సబ్ ఇన్‌స్పెక్టర్ దేవరపల్లి - 9440796624 నంబర్లకు సంప్రదించాలని కోరారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషకం అందిస్తామని పేర్కొన్నారు.
Bathula Prabhakar
Bathula Prabhakar escape
Vijayawada
Rajahmundry Central Jail
Devarapalli
Andhra Pradesh Police
Hyderabad Jubilee Hills
Criminal cases
Most wanted criminal
Police custody escape

More Telugu News