Naina Ganguly: ప్రియుడి చేతిలో నరకం చూశా: హీరోయిన్ నైనా గంగూలీ సంచలన పోస్ట్

Naina Ganguly Reveals Shocking Abuse by Boyfriend
  • ప్రియుడి వేధింపులపై నటి నైనా గంగూలీ సంచలన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
  • కోల్‌కతా కొరియోగ్రాఫర్‌తో కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడి
  • శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా టార్చర్ పెట్టాడన్న నైనా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'వంగవీటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నైనా గంగూలీ, తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. కొన్నేళ్లుగా తాను ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతని చేతిలో శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే గత మూడేళ్లుగా తాను ఏ సినిమాలోనూ నటించలేకపోయానని వెల్లడించారు.

ఈ విషయంపై నైనా గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "కొన్ని వ్యక్తిగత విషయాలను మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చింది. నేను కొన్నేళ్లుగా కోల్‌కతాకు చెందిన ఒక కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్నాను. కానీ, ప్రేమలో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ప్రతిరోజూ శారీరక, మానసిక హింస అనుభవిస్తున్నాను. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను" అని ఆమె ఆరోపించారు. తనను వేధిస్తున్న ఆ ప్రియుడి పేరును త్వరలోనే బయటపెడతానని కూడా ఆమె స్పష్టం చేశారు.

కోల్‌కతాలో పుట్టి మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నైనా గంగూలీ, ఆర్జీవీ దృష్టిలో పడి 'వంగవీటి' సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన 'డేంజరస్' చిత్రంలోనూ నటించారు. వీటితో పాటు 'జోహార్', 'మళ్ళీ మొదలైంది', 'తగ్గేదే లే' వంటి చిత్రాలతో పాటు కన్నడలోనూ ఓ సినిమా చేశారు. ఇప్పుడు ఆమె చేసిన ఆరోపణలతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Naina Ganguly
Naina Ganguly abuse
Vangaveeti actress
Ram Gopal Varma
RGV Dangerous movie
Kolkatta choreographer
domestic violence
tollywood news
actress allegations
abuse relationship

More Telugu News