Jagan: ఇదొక విప్లవాత్మకమైన అడుగు: కొత్త జీఎస్టీ శ్లాబులపై జగన్
- కొత్త జీఎస్టీ శ్లాబులపై స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్
- పన్నుల వ్యవస్థలో ఇదొక విప్లవాత్మక పరిణామం ప్రశంస
- సామాన్య ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుందని వ్యాఖ్య
- ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరాలని ఆశాభావం
- ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడి
దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) శ్లాబులపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జీఎస్టీలో చేపట్టిన క్రమబద్ధీకరణను ఆయన స్వాగతించారు. సరళమైన, న్యాయమైన పన్నుల వ్యవస్థను రూపొందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కొత్త విధానం వల్ల వస్తువులు, సేవలు ప్రతి పౌరుడికి మరింత సులభంగా, అందుబాటు ధరల్లో లభించేందుకు మార్గం సుగమం అవుతుందని జగన్ పేర్కొన్నారు. "జీఎస్టీ పునర్నిర్మాణం సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. వస్తువులు, సేవలను ప్రతి పౌరుడికి మరింత సరళంగా, సరసమైనదిగా మార్చడానికి ఈ చర్యలు ఎంతో తోడ్పడతాయి" అని ఆయన అన్నారు.
అమలు ప్రక్రియలో తొలినాళ్లలో కొన్ని ఫిర్యాదులు, నిర్వహణలో లోపాలు ఉండవచ్చని అభిప్రాయపడుతూనే, ఇదొక నిరంతర ప్రక్రియ అని జగన్ తెలిపారు. అంతిమంగా దీని ప్రయోజనాలు సామాన్య వినియోగదారులకు కచ్చితంగా చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి, మరింత పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది" అని ఆయన తన పోస్టులో వివరించారు.